Namaste NRI

అమెరికాలో హైదరాబాద్‌ యువకుడు పై దాడి

హైదరాబాద్‌కు చెందిన ఒక యువకుడు సయ్యద్‌ మజహిర్‌ అలీపై అమెరికాలోని షికాగోలో అటాక్ జ‌రిగింది. దారి దోపిడీకి పాల్ప‌డిన న‌లుగురు దొంగలు అత‌న్ని తీవ్రంగా కొట్టారు. అత‌ను ఉంటున్న ఇంటివ‌ద్దే ఆ దాడి జ‌రిగింది. ప్లీజ్ హెల్ప్ చేయండి అంటూ ఓ వీడియోలో అత‌ను వేడుకున్నాడు. త‌ల, ముక్కు, మూతి నుంచి ర‌క్తం కారుతుండ‌గా,  తీవ్ర ప‌రిస్థితుల్లో ఉన్న అత‌ను త‌న‌ను ఆదుకోవాల‌ని కోరాడు. ఆ వీడియోను ప్ర‌స్తుతం ఆన్‌లైన్‌లో పోస్టు చేశారు. సయ్యద్‌ మజహిర్‌ అలీ ఇండియన్‌ వెస్లియన్‌ యూనివర్సిటీలో ఐటీలో మాస్టర్స్‌ చేస్తున్నాడు. భ‌ర్త‌ను ఆదుకోవాల‌ని అతడి భార్య ఫాతిమా రిజ్వీ కేంద్ర విదేశాంగ శాఖ‌ను కోరింది. ఆయ‌న‌కు మంచి చికిత్సను అందించాల‌ని మంత్రి జైశంక‌ర్‌ను కోరారు. చికాగోలో ఉన్న త‌న భ‌ర్త సెక్యూర్టీ విష‌యంలో ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌న్నారు. త‌న‌కు ముగ్గురు పిల్ల‌లు ఉన్నార‌ని, త‌న భ‌ర్త‌కు వెళ్లేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆమె విదేశాంగ శాఖ‌ను కోరుకున్న‌ది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events