Namaste NRI

శాంతి చర్చలు విఫలమైతే దాడులు… డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరిక

ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలకు సమయం ముంచుకొస్తున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. ఇరాన్‌ వద్ద ఇక ఏ మార్గమూ మిగల్లేదని, కీలక అంతర్జాతీయ జలమార్గాలపై నియంత్రణ ద్వారా ప్రపంచాన్ని స్వల్పకాలికంగా దోచుకోవడంపై మాత్రమే ఇరాన్‌ ఆధారపడుతున్నదని విమర్శించారు. తమ వద్ద వేరే మార్గాలు లేవని ఇరానీయులు ఇంకా గ్రహించినట్లు లేరని ఆయన వ్యాఖ్యానించారు. వారు ఈ రోజు సజీవంగా ఉండడానికి ఏకైక కారణం చర్చలు జరపడమే అని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో శాంతి చర్చలు విఫలమైతే దాడులను పునరుద్ధరించడానికి శక్తివంతమైన ఆయుధాలతో అమెరికా యుద్ధ నౌకలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events