ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతున్నది. దీనితో పాటు దాని నిరీక్షణ సమయం కూడా అనూహ్యంగా పెరిగిపోయింది. ఆస్ట్రేలియా జనరల్ పేరెంట్ వీసా కోసం 31 ఏండ్లు, కాంట్రిబ్యూటరీ పేరెంట్ వీసా కోసం 14 ఏండ్లు నిరీక్షించాల్సి ఉందని తాజా నివేదిక తెలియజేసింది. దీంతో ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో గత మూడేండ్లలో 2300 మంది మరణించినట్టు ఆస్ట్రేలియా హోం శాఖ తెలిపింది.
ఆస్ట్రేలియా పేరెంట్ వీసాలకు డిమాండ్ బాగా పెరగడంతో దీని సంఖ్యను ఏడాదికి 4500 నుంచి 8500కు పెంచారు. అయితే ఇవి ఏ మూలకూ సరిపోవడం లేదు. వీటి కోసం వచ్చే దరఖాస్తులు మాత్రం అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. 2023లో వీటి దరఖాస్తులు 1.5 లక్షలకు చేరుకున్నట్టు అధికారులు తెలిపారు.