నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రానికి బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. విధి కథానాయిక. రామ్ దేశినా దర్శకత్వం. ఈ చిత్రాన్ని శ్రీవైష్ణవి ఫిల్మ్స్ పతాకంపై చింతలపూడి శ్రీనివాస రావు నిర్మిస్తున్నారు. నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ ఇదని, నాగశౌర్య మునుపెన్నడూ చూడని విధంగా పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తాడని మేకర్స్ తెలిపారు. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని నిర్మాత తెలిపారు. సముద్రఖని, వీకే నరేష్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్ నటిస్తున్నారు. చిత్రానికి కెమెరా: రసూల్ ఎల్లోర్, సంగీతం: హారిస్ జైరాజ్, రచన-దర్శకత్వం: రామ్ దేశిన (రమేష్).