నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం అఖండ2. సంయుక్త హీరోయిన్. ఈ సినిమాను 14 రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. తొలి పార్ట్ సూపర్ హిట్ సాధించడంతో రెండో పార్ట్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. బాలయ్య బర్త్ డే (జూన్ 10) సందర్భంగా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ఈ టీజర్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పిస్తుంది. బాలయ్య తనదైన శైలిలో డైలాగ్స్‌తో అదరగొట్టారు. నా శివుడి అనుమతి లేనిదే ఆ యముడు కన్నేత్తి చూడడు.. నువ్వు చూస్తావా అంటూ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది.

అఖండగా బాలకృష్ణ పాత్ర రౌద్రరసపూరితంగా సాగింది. వేదం చదివిన శరభం యుద్ధానికి దిగింది అనే సంభాషణతో ముగిసిన టీజర్ అభిమానులకు కావాల్సినంత థ్రిల్‌ను పంచింది. దర్శకుడు బోయపాటి శ్రీను యూనిక్ మేకింగ్, బాలకృష్ణ హై ఇంటెన్సిటీ పర్‌ఫార్మెన్స్, కైలాసగిరి నేపథ్య విజువల్స్ టీజర్‌పై అంచనాలు పెంచాయి. ఈ చిత్రానికి సంగీతం: తమన్, సమర్పణ: తేజస్విని నందమూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట, రచన-దర్శకత్వం: బోయపాటి శ్రీను.
