Namaste NRI

బండి సంజయ్ పాదయాత్ర వాయిదా

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ నిర్వహించ తలపెట్టిన పాదయాత్ర వాయిదా పడిరది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర జనరల్‌ సెక్రెటరీ గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి వెల్లడిరచారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 9న చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి బండి సంజయ్‌ పాదయాత్ర ఉంటుందని గతంలో నిర్ణయించాం. కానీ, పార్లమెంట్‌ సమావేశాలు, ముఖ్యమైన బిల్లుల దృష్ట్యా ఆగస్టు 24కు వాయిదా వేశాం అన్నారు. ప్రజా దీవెనయాత్రలో ఈటల రాజేందర్‌ గాయమైన కారణంగా పాదయాత్రకు తాత్కాలిక విరామిస్తున్నామని చెప్పారు.

          కేంద్ర కేబినెట్‌ మంత్రిగా కిషన్‌రెడ్డిని నియమించడాన్ని తెలంగాణ ప్రజలకు అందిన గౌరవంగా అభివర్ణించారు. కేబినెట్‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కిషన్‌ రెడ్డి మొదటి సరిగా రాష్ట్రానికి వస్తున్నారని అన్నారు. కోదాడ నుంచి బీజేపీ కార్యాలయం వరకు యాత్ర ఉంటుందని చెప్పారు. ఆగస్టు 16, 17, 18 వరకు కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇందులో భాగంగా రామప్ప గుడిని కూడా సందర్శిస్తారని తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events