అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ ఒబామాతో విడిపోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. కుటుంబ జీవితానికి ప్రాధాన్యతను ఇస్తూ, ఎంతో అన్యోన్యంగా ఉండడంతో పాటు మోస్ట్ పాపులర్ కపుల్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ జంట. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ జంట విడిపోతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ వార్తలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టాడు ఒబామా. మిచెల్ బర్త్‌డే కావడంతో ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.

నా జీవితంను ప్రేమతో నింపిన నా ప్రేయసి మిచెల్ ఒబామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా జీవితంలోని ప్రతి గదిని నీ వెచ్చదనంతో, నాలెడ్జ్‌తో, హాస్యంతో నింపావు. ఇలా చేయడం వలన ఇంకా బాగున్నావు. నీతో జీవిత సాహసాలు చేయడంలో భాగమైనందుకు నేను అదృష్టవంతుడిని అంటూ బరాక్ ఒబామా రాసుకోచ్చాడు.
