
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. మాజీ ఫస్ట్‌లేడీ, ఒబామా సతీమణి మిచెల్ ఒబామా తల్లి మరియన్ రాబిన్సన్ కన్నుమూశారు. ప్రస్తుతం ఆమె వయసు 86. ఈ విషయాన్ని బరాక్, మరియన్ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయం లో కుమార్తె, అల్లుడితో కలిసి మరియన్ శ్వేత సౌధంలోనే ఉన్నారు. ఒబామా ఇద్దరు పిల్లలు మాలియా, సాషా సంరక్షణను ఆమే చూసుకున్నారు. మరియన్‌ను కుటుంబ సభ్యులు ముద్దుగా మొదటి బామ్మ అని పిలుచు కుంటారు. మరియన్ మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పలువురు మరియన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.
