అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు 18 ఏళ్ల బారన్ ట్రంప్ ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాడు. మీడియాలో అరుదుగా కనిపించే బారన్ ఈస్టర్ వేడుకల్లో తల్లి మెలానియాతో కలిసి సందడి చేశాడు. ఫ్లోరిడాలోని పాల్మ్ బీచ్ వద్ద ఉన్న మార్ ఎ లాగో క్లబ్‌లో ఒక్కసారిగా దర్శనమిచ్చాడు. ట్రంప్ 2005లో మెలానియాను వివాహం చేసుకున్నారు. వీరికి మార్చి 20, 2006లో బారన్ జన్మించాడు. డొనాల్డ్ ట్రంప్‌కు బారన్ ఐదో సంతానం కాగా, మెలానియాకు మొదటి సంతానం. బారన్ తన బాల్యాన్ని న్యూయార్క్‌లోనే గడిపాడు. మాన్‌హటన్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకున్నాడు. ట్రంప్ 2017లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై బాధ్యతలు చేపట్టిన సమయంలో బారన్, మెలానియా ఇద్దరూ మాన్‌హటన్‌లోనే ఉండిపోయారు. కుమారుడి చదువు కోసం వారు అక్కడ ఉండిపోవాల్సి వచ్చిందని ట్రంప్ అప్పట్లో చెప్పారు. పాఠశాల చదువు పూర్తైన తర్వాత అధ్యక్షుడి కుమారుడి హోదాలో బారన్ వైట్‌హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. బారన్ చాలా మంచి అథ్లెట్. అతను మంచి పిల్లవాడు. అతనో గొప్ప విద్యార్థి అని గతంలో ట్రంప్ తెగ ప్రశంసించేవారు.