ప్రణవ్ప్రీతం, షాజ్ఞ శ్రీవేణున్ జంటగా నటిస్తున్న చిత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు. శ్రీనాథ్ పులకురం దర్శకుడు. బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై భువన్ రెడ్డి కొవ్వూరి నిర్మిస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా కోసం ఆర్టిస్టులందరిని మా ఊరు పుంగనూరు తీసుకెళ్లి రాయలసీమ యాస నేర్పించాను. చిత్రీకరణ మొత్తం అదే ఊరిలో చేశాం. సహజమైన పాత్రలతో హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది అన్నారు.
పరిమిత బడ్జెట్లోనే అత్యుత్తమ క్వాలిటీతో ఈ సినిమా తీశామని, టీనేజ్ ప్రేమకథగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుందని నిర్మాత భువన్ రెడ్డి తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ సభ్యులంద రూ మాట్లాడారు. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది.