కెనడా లోని హాలిఫ్యాక్స్ నగరంలో తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘మ్యారిటైం తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో బెడ్ఫోర్డ్ హామండ్స్ ప్లేయిన్స్ కమ్యూనిటీ సెంటర్‌లో బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకున్నారు. తీరొక్క పూలతో 8 అడుగుల ఎత్తయిన బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు అంతా ఒకచోట చేరి ఆడిపాడుతూ..బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)