Skip to main content

Namaste NRI

కెనడా లో బతుకమ్మ వేడుకలు

కెనడా లోని హాలిఫ్యాక్స్ నగరంలో  తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ‘మ్యారిటైం తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో బెడ్ఫోర్డ్ హామండ్స్ ప్లేయిన్స్ కమ్యూనిటీ సెంటర్‌లో  బతుకమ్మ పండుగ సంబురాలు జరుపుకున్నారు. తీరొక్క పూలతో 8  అడుగుల ఎత్తయిన బతుకమ్మలను పేర్చిన ఆడబిడ్డలు అంతా ఒకచోట చేరి ఆడిపాడుతూ..బతుకమ్మ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. మహిళలు, చిన్నారులు సంప్రదాయ వస్త్రధారణలో ఆకట్టుకున్నారు. బతుకమ్మ వేడుకల్లో తెలుగు ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొనడం పట్ల అసోసియేషన్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News