టెస్లా సీఈవో ఎలాన్ మాస్క్‌కు లూయిస్ విట్టాన్ కంపెనీ ఎల్వీఎంహెచ్ సీఈవో బెర్నార్డ్ అర్నాల్ట్ షాక్ ఇచ్చారు. ప్రపంప సంపన్నుల జాబితాలో టాప్ ప్లేప్‌లో బెర్నార్డ్ అర్నాల్డ్ నిలిచారు. ఈ ఏడాది మాస్క్ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో మస్క్‌ను వెనక్కి నెట్టివేస్తూ బెర్నార్డ్ మొదటి స్థానాన్ని ఆక్రమించేశారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్‌స ప్రకారం బెర్నార్డ్ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది. మాస్క్ ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. 44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. కానీ ఇటీవల టెస్లా షేర్లు పడిపోవడం వల్ల ఆయన సంపద తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 2021 జనవరిలో తొలిసారి ప్రపంచ సంపన్నుల జాబితాలో 185 బిలియన్ల డాలర్లతో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.