Skip to main content

Namaste NRI

ఎలాన్‌ మాస్క్‌ షాక్‌ ఇచ్చిన బెర్నార్డ్‌ అర్నాల్ట్‌  

టెస్లా సీఈవో ఎలాన్‌ మాస్క్‌కు  లూయిస్‌ విట్టాన్‌ కంపెనీ  ఎల్వీఎంహెచ్‌ సీఈవో బెర్నార్డ్‌ అర్నాల్ట్‌ షాక్‌ ఇచ్చారు.  ప్రపంప సంపన్నుల జాబితాలో టాప్‌ ప్లేప్‌లో బెర్నార్డ్‌ అర్నాల్డ్‌ నిలిచారు.  ఈ ఏడాది మాస్క్‌ సుమారు 100 బిలియన్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోయారు. దీంతో మస్క్‌ను వెనక్కి నెట్టివేస్తూ బెర్నార్డ్‌ మొదటి స్థానాన్ని ఆక్రమించేశారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్‌స ప్రకారం బెర్నార్డ్‌ ఆస్తులు 172.9 బిలియన్ల డాలర్లు కాగా, మస్క్‌ ఆస్తుల విలువ 168.5 బిలియన్ల డాలర్లుగా ఉంది.  మాస్క్‌ ఇటీవల ట్విట్టర్‌ను కొనుగోలు చేశారు. 44 బిలియన్ల డాలర్లు పెట్టి ట్విట్టర్‌ను ఆయన సొంతం చేసుకున్నారు. కానీ ఇటీవల టెస్లా షేర్లు పడిపోవడం వల్ల ఆయన సంపద తగ్గిపోయినట్లు తెలుస్తోంది. 2021 జనవరిలో తొలిసారి ప్రపంచ సంపన్నుల జాబితాలో 185 బిలియన్ల  డాలర్లతో ఫస్ట్‌  ప్లేస్‌లో నిలిచారు. 

Social Share Spread Message

Latest News