Namaste NRI

బెస్ట్‌ కపుల్స్‌  ఆరోజే

జయంత్‌ వదాలి,  శగ్న శ్రీ జంటగా నటిస్తున్న చిత్రం బెస్ట్‌ కపుల్‌.  వన్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై పార్థురెడ్డి నిర్మిస్తున్నారు.  గణేష్‌ దొరల దర్శకుడు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. భర్యభర్తల మధ్య ఉండే ప్రేమాభిమానాలతో పాటు వారి మధ్య తలెత్తే మనస్పర్థల్ని చర్చిస్తూ ఈ సినిమా సాగుతుంది.  ప్రతి ఒక్కరికి కనెక్ట్‌ అవుతుంది అన్నారు. చలాకి చంటి, ఇమ్మాన్యుయెల్‌ నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహర్ష్‌ రవిచంద్ర, రచన: అభిషేక్‌ మోగలపు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గణేష్‌ దొరల.

Social Share Spread Message

Latest News