Namaste NRI

పీపుల్‌ పాలిటిక్స్‌తో భద్రకాళి

విజయ్‌ ఆంటోని  కథానాయకుడిగా రూపొందిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ భద్రకాళి. అరుణ్‌ప్రభు దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజి నిర్మాత. ఈ నెల 19న సినిమా విడుదల కానుంది. ఏషియన్‌ సురేశ్‌ ఎంటైర్టెన్మెంట్‌, రానా దగ్గుబాటి స్పిరిట్‌ మీడియా కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో విజయ్‌ ఆంటోని మాట్లాడారు. దర్శకుడు అరుణ్‌ ప్రభు అద్భుతమైన కథ రాసుకున్నారు. దాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారు. ఆయనతో వర్క్‌ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. నా అభిప్రాయం ప్రకారం ఇండియాలో టాప్‌టెన్‌ డైరెక్టర్స్‌లో తను ఒకరు. చాలా టాలెంటెడ్‌ పర్సన్‌. ఆ ప్రతిభను మీరు తెరపై చూస్తారు అని అన్నారు.

ఇది మంచి పొలిటిక్‌ థ్రిల్లర్‌. ఏ రాష్ర్టానికో దేశానికో సంబంధించిన పాలిటిక్స్‌ ఇందులో ఉండవ్‌. ఇది పీపుల్‌ పాలిటిక్స్‌. అందరికీ రిలేట్‌ అయ్యేలా ఉంటుంది. మీ అందరి అంచనాలనూ భద్రకాళి అందుకుంటుంది అని దర్శకుడు నమ్మకం వెలిబుచ్చారు. దర్శకుడు అరుణ్‌ సమాజంలోని కీలకమైన అంశాలను సందేశాత్మకంగా ఈ కథలో డీల్‌ చేశారని నిర్మాత రామాంజనేయులు అన్నారు. ఇంకా అగ్ర నిర్మాత డి.సురేశ్‌బాబు, కథానాయిక తృప్తి రవీంద్ర, రైటర్‌ భాషశ్రీ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events