బెల్లకొండ సాయిశ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం భైరవం. అతిథి శంకర్ కథానాయిక. విజయ్ కనకమేడల దర్శకుడు. శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్స్ ఆసక్తిని రేకెత్తించాయి. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను మొదలుపెట్టబోతున్నారు. ఈ నెల 3న బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టిన రోజు సందర్భంగా ఓ వెన్నెల అంటూ సాగే గీతాన్ని విడుదల చేస్తున్నారు. మంగళవారం పాట తాలూకు పోస్టర్‌ను రిలీజ్ చేశారు. హుషారుగా సాగే ప్రేమ గీతంగా మెప్పిస్తుందని, నాయకానాయికల నృత్యాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: హరి కె వేదాంతం, సంగీతం: శ్రీచరణ్ పాకాల, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: విజయ్ కనకమేడల.