తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్ల పాటు టీటీడీ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. చైర్మన్‌గా నియమించిన ముఖ్యమంత్రి జగన్‌కు ఈ సందర్భంగా భూమన ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కడప జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో భూమన జన్మించారు. తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్యవిద్యాలయం నుంచి ఎంఏ పట్టా పొందారు. ప్రస్తుతం తిరుపతి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి గతంలోనూ టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. వైఎస్ హయాంలో 2006 నుంచి 2008 వరకు టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2012 ఉప ఎన్నికలో , 2019 సాధారణ ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రెండు పర్యాయాలు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం (ఆగస్టు 5)తో ముగిసింది. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్‌గా కరుణాకర్‌రెడ్డికి అవకాశం లభించింది.