అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా టెస్టుల్లో నెగెటివ్ రావడంతో వైట్‌హౌస్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. శ్వేతసౌధంలో మళ్లీ అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. తాను వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నానని తెలిపారు. కాగా, ప్రస్తుతం బైడెన్ ఆరోగ్యంగా ఉన్నట్లు ఆయన వ్యక్తిగత వైద్యుడు కెవిన్ వెల్లడించారు. బైనాక్స్ ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలో ఆయనకు నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవన్నారు.

గత బుధవారం కొవిడ్ సోకడంతో బైడెన్ డెలావేర్‌లోని తన నివాసంలో ఐసోలేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తన పదవీ కాలం పూర్తయ్యేవరకు అధ్యక్షుడిగా కొనసాగుతానని వెల్లడించారు.
