Namaste NRI

బింబిసార ప్రీక్వెల్ వచ్చేస్తోంది

హీరో కల్యాణ్‌రామ్‌ 21వ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వం. ఈ చిత్రాన్ని అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మిస్తున్నారు. పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పాత్ర నవ్యరీతిలో ఉంటుందని, ఫైర్‌ యాక్షన్‌ ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర బృందం పేర్కొంది. పోస్టర్‌లో కల్యాణ్‌రామ్‌ ఇంటెన్స్‌ లుక్‌తో కనిపిస్తున్నారు. విజయశాంతి ఐపీఎస్‌ అధికారి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో సోహైల్‌ఖాన్‌, సాయి మంజ్రేకర్‌, శ్రీకాంత్‌ ఇతర ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ సంగీతాన్నందిస్తున్నారు.

బింబిసార చిత్రం హీరో కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఈ సినిమాకు రెండో భాగం ఉంటుందని గతంలోనే మేకర్స్‌ వెల్లడించారు.  శుక్రవారం కల్యాణ్‌రామ్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా ప్రీక్వెల్‌ ప్రకటన చేశారు. దీనికి అనిల్‌ పాదూరి దర్శకత్వం వహించనున్నారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. బింబిసార కన్నా యుగాల ముందు త్రిగర్తలను ఏలిన లెజెండ్‌ని చూడడానికి సిద్ధంగా ఉండండి అనే క్యాప్షన్‌తో ప్రీక్వెల్‌ను అనౌన్స్‌ చేశారు. ఈ ప్రీక్వెల్‌ను అత్యుత్తమ సాంకేతిక హంగులతో తెరకెక్కించబోతున్నామని చిత్ర బృందం పేర్కొంది. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై రూపొందనున్న ఈ సినిమా ప్రస్తుతం పూర్వ నిర్మాణ కార్యక్రమాలను జరుపుకుంటున్నది. త్వరలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress