నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కువైట్లోని జాబ్రియా బ్లడ్ బ్యాంక్లో ఎన్నారై టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు ఈ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఎన్నారై టీడీపీ కువైట్ కమిటీ కార్యవర్గ సభ్యులు, నాలుగు గవర్నరేట్ కోఆర్డినెటర్లు, జాయింట్ కోఆర్డినేటర్లు, కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమం లో తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనిగళ్ల బాల కృష్ణ, గుండయ్య నాయుడు, సురేష్ మాలేపాటి, చిన్న రాజు, దివాకర్ ఓలేటి, శ్రీనివాస్ చౌదరి, లక్ష్మీపతి, బోయపాటి శ్రీను, నాయనేని సుధాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధ్యక్షులు ఎన్నారై టీడీపీ కమిటీ తరుపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)