Skip to main content

Namaste NRI

ఎన్టీఆర్‌ జయంతి పురస్కరించుకొని ఎన్నారై టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం

నందమూరి తారకరామారావు జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కువైట్లోని  జాబ్రియా బ్లడ్ బ్యాంక్లో ఎన్నారై టీడీపీ కువైట్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.  గల్ఫ్ కౌన్సిల్ సభ్యులు వెంకట్ కోడూరి, అధ్యక్షులు అక్కిలి నాగేంద్ర బాబు ఈ  అధ్యక్షతన కార్యక్రమం  నిర్వహించారు. ఎన్నారై టీడీపీ  కువైట్ కమిటీ కార్యవర్గ సభ్యులు, నాలుగు గవర్నరేట్ కోఆర్డినెటర్లు, జాయింట్ కోఆర్డినేటర్లు, కార్యవర్గ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ రక్తదాన కార్యక్రమం లో తెలుగుదేశం సీనియర్ నాయకులు వెనిగళ్ల బాల కృష్ణ, గుండయ్య నాయుడు, సురేష్ మాలేపాటి, చిన్న రాజు, దివాకర్ ఓలేటి, శ్రీనివాస్ చౌదరి, లక్ష్మీపతి, బోయపాటి శ్రీను, నాయనేని సుధాకర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అధ్యక్షులు ఎన్నారై టీడీపీ కమిటీ తరుపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

Social Share Spread Message

Latest News