సింగపూర్‌లోని తెలంగాణ కల్చరల్ సొసైటీ (టీసీఎస్‌ఎస్) ఆధ్వర్యంలో బోనాల పండుగను కరోనా నేపథ్యంలో నిరాండబరంగా జరిపారు. సింగపూర్ సుంగే కేడుట్‌లో శ్రీ అరస కేసరి శివన్ దేవాలయంలో బోనాలు సమర్పించారు. ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని, కరోనా నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని ప్రత్యేక పూజలు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. టీసీఎస్‌ఎస్ ఉపాధ్యక్షుడు గర్రెపల్లి కస్తూరి శ్రీనివాస్, గోనె రజిత నరేందర్ రెడ్డి, సంసాగత కార్యదర్శి గడప స్వామి రమేశ్, పూర్వ అధ్యక్షుడు బండ శ్రీదేవి మాధవరెడ్డి దంపతులు బోనం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, సునీతారెడ్డి, రోజారమణి, గోనె రజిత జూలూరు, పద్మజ, కాసర్ల శ్రీనివాస్‌రావు పాల్గొన్నారు.