ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరంలో రాక్‌బ్యాంక్ దుర్గామాత ఆలయంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. గత 10 సంవత్సరాలుగా బోనాలను నిర్వహిస్తున్న మెల్‌బోర్న్ బోనాలు సంస్థ ఈసారి కూడా పండుగను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు, తొట్టెలు సమర్పించారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. పోతురాజుల ఆటలు, యువకుల పాటలు నృత్యాలతో బోనాల జాతర కన్నుల పండవగా సాగింది. బోనాల పాటలకు తెలంగాణ యువకులతో పాటు భారత్‌లోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు కూడా డ్యాన్సులు చేయడం విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మెల్‌బోర్న్ బోనాలు సంస్థ నిర్వాహకులు తెలంగాణ మధు, రాజు వేముల, దీపక్ గద్దె, ప్రజీత్ రెడ్డి కోతిలను వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అభినందించారు.