పాకిస్థాన్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోత వర్షాలకు వరదలు సంభవించాయి. వారం రోజులుగా కురుస్తున్న ఈ వర్షాలకు 30 మందికిపైగా మరణించారని అధికారులు తెలిపారు. రోడ్లు, వంతెనలు కొట్టుకుపో యాయి. వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దేశవ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా ఆ దేశం లోని రెండో అతిపెద్ద నగరమైన లాహోర్ పూర్తిగా నీట మునిగింది. ఇక్కడ నాలుగు దశాబ్దాల రికార్డు బద్దలైం ది. 44 ఏళ్ల తర్వాత లాహోర్‌లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. లాహోర్‌లో ఆరు మరణాలు నమోదైనట్లు తెలిపారు. ఇక ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో గత మూడు రోజుల్లో రెండు డజన్ల మంది ప్రాణాలు కోల్పోయినట్లు విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అన్వర్ షెహజాద్ వెల్లడించారు. అందులో 12 మంది చిన్నారులు ఉన్నట్లు చెప్పారు.