
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ క్షమాపణలు కోరారు. డీ డే సంబరాల నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయినందుకు సారీ చెప్పారు. తప్పు జరిగినట్లు ఆయన అంగీకరించారు. ఫ్రాన్స్‌లోని నార్మాండీలో జరుగుతున్న డీ డే సెలబ్రేషన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన రిషి సునాక్, అకస్మాత్తుగా ఆ కార్యక్రమంలో పాల్గొనకుండానే మళ్లీ స్వదేశానికి పయనం అయ్యారు. అయితే ఆయనపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిషి సునాక్ క్షమాపణలు కోరారు. ప్రతి ఇంటి నుంచి సుమారు రెండు వేల పౌండ్ల పన్ను వసూల్ చేయనున్నట్లు ఇటీవల రిషి సునాక్ పేర్కొన్న నేపథ్యంలో విపక్షాల నుంచి ఆయన తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొంటున్నారు. అయితే తాను ఆ అంశంపై అబద్ధం చెప్పలేదంటున్నారు. బ్రిటన్‌లో త్వరలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
