ఢిల్లీలో జీ20 సమ్మిట్ సందడి నెలకొన్నది. భారత్ అధ్యక్షత వహిస్తున్న ఈ కూటమి శిఖరాగ్ర సమావేశం ఈ నెల 9, 10న జరుగనున్నది. ఈ సదస్సులో పాల్గొనేందుకు అగ్ర దేశాల అధినేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన భార్య అక్షతా మూర్తితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వచ్చారు. కేంద్ర సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే వారికి స్వాగతం పలికారు.
