ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను ఆత్మీయంగా పలుకరించారు. ఓబీసీ పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులతో ఢల్లీిలో సంజయ్ ప్రధాన మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా క్యా బండి జీ.. క్యా హాలే? ( ఏం బండి గారు.. ఎలా ఉన్నారు?) అంటూ ప్రధాని మాట్లాడారు. ప్రధాని మోదీ సంజయ్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను క్షేత్ర స్థాయికి తీసుకెళ్లాని ప్రధాని సూచించగా, రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలుచస్తామని సంజయ్ అన్నారు.