గోపీచంద్, తమన్నా జంటగా కబడ్డీ నేపథ్యంలో రూపొందిన చిత్రం సీటీమార్. సంపత్ నంది దర్శకుడు. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. గోపీచంద్, రాజమండ్రి ఎంపీ భరత్, బోయపాటి శ్రీను, లింగుస్వామి, మారుతి, కె.కె.రాధామోహన్, కోన వెంకట్‌తో పాటుగా ప్రశాంత్ వర్మ, అప్సరరాణి, మంగ్లీ తదితరులు పాల్గొని సినిమా విజయాన్ని కాంక్షిస్తూ మాట్లాడారు.