Namaste NRI

కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత మృతి

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లాస్య నందిత  కన్నుమూశారు. ఓఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే అక్కడికక్కడే మృతిచెందారు. పటాన్‌చెరూ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై ఆమె ప్రయాణి స్తున్న కారు అదుపుతప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలా నికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్‌ను దవాఖానకు తరలించారు. ఎమ్మెల్యే లాస్య నందిత ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో గాయడ్డారు. నల్లగొండలో బీఆర్‌ఎస్‌ బహిరంగసభకు హాజరై తిరిగి వస్తుండగా నార్కట్‌పల్లి సమీపంలోని చెర్లపల్లి వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొట్టింది. ఇంతలోనే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.

లాస్య నందిత 1987లో హైదరాబాద్‌లో జన్మించారు. కంప్యూటర్‌ సైన్స్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. అనంతరం 2015లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేఏడాది జరిగిన కంటోన్మెంట్‌ బోర్డు ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. 2016లో తన తండ్రి, అప్పటి ఎమ్మెల్యే సాయన్నతోపాటు బీఆర్‌ఎస్‌లో చేరారు. 2016-20 మధ్య కవాడిగూడ కార్పొరేటర్‌గా పనిచేశారు. 2021లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కవాడిగూడ నుంచి పోటీచేసి ఓటమి చవి చూశారు. తండ్రి మరణంతో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్‌ నుంచి పోటీచేసి విజయం సాధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events