Namaste NRI

కెప్టెన్‌ మిల్లర్‌ వస్తున్నాడు

ధనుష్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కెప్టెన్‌ మిల్లర్‌. అరుణ్‌ మాథేశ్వరన్‌ దర్శకుడు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మాతలు. ఈ చిత్ర సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ సర్టిఫికెట్‌ లభించింది. అన్ని వర్గాలను ఆకట్టుకునే పీరియాడిక్‌ డ్రామా కథాంశమిది. 1930-40 దశకంలో కథ నడుస్తుంది. ధనుష్‌ పాత్ర మునుపెన్నడూ చూడనంత పవర్‌ఫుల్‌గా ఉంటుంది. యాక్షన్‌ ఘట్టాలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభిస్తుంది అని చిత్ర బృందం తెలిపింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.  ఈ చిత్రానికి కెమెరా: సిద్ధార్థ నుని, నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్‌, రచన-దర్శకత్వం: అరుణ్‌ మాథేశ్వరన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events