అమెరికా ప్రెసిడెంట్‌గా ఎన్నికైన జో బైడెన్ తొలిసారి ఇజ్రాయెల్‌లో పర్యటించారు. బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో విమానం దిగిన జో బైడెన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని యైర్ లాపిడ్, అధ్యక్షుడు బజాక్ హెర్జాగ్ స్వాగతం పలికారు.
ఢిల్లీలోని సుప్రీంకోర్టు సముదాయంలో న్యాయవాదుల కోసం నూతనంగా నిర్మించిన యుటిలిటీ లాంజ్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
కొత్త పార్లమెంట్ భవనంపై ఏర్పాటు చేసిన నాలుగు సింహాల జాతీయ చిహ్నాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
చండీగఢ్‌లో పంజాబ్ సీఎం భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా హాజరయ్యారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన బోనాల వేడుకలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలోని కోమటి బండలో గల మిషన్ భగీరథ ప్లాంటును సందర్శిoచారు.
జీవన సాఫల్య పురస్కార ప్రదాన మహోత్సవంలో ప్రముఖ నేపధ్య గాయని పీ.సుశీలను వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు దంపతులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఆటా 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది.