ధావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో పాల్గొనేందుకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వాగతం పలికిన మంత్రులు భారత్ ఎంబసీ అధికారులు.
వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ ను కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీనివాసుడి కళ్యాణోత్సవం.
హైదరాబాద్ రాయదుర్గంలో ఉన్న నాలెడ్జ్ సెంటర్లో అమెరికాకు చెందిన కాల్‌అవే గోల్ఫ్ సంస్థ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కేంద్ర ఎన్నికల సంఘం తదుపరి ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. ఈ నెల 15 న నూతన ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌గా రాజీవ్ కుమార్ పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
శ్రీలంక కొత్త ప్రధానిగా రణిల్ విక్రమసింఘే(73) బాధ్యతలు చేపట్టారు. అధ్యక్షుడు గోటబయా రాజపక్స దగ్గరుండి మరీ విక్రమసింఘే లంక ప్రధానిగా ప్రమాణం చేయించారు.
ఎయిర్ ఇండియా సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్‌గా క్యాంప్‌బెల్ విల్సన్‌ను నియమిస్తూ టాటా సన్స్ పేర్కొన్నది.
బ్రహ్మోస్ మిస్సైల్ ఎక్స్టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఈ సందర్భంగా ‘డైరెక్ట్ హిట్’ అంటూ హర్షం వ్యక్తం చేసింది.
ఇటీవల మరణించిన ఫోటో జర్నలిస్టు డానిష్ సిద్ధిక్‌కు రెండవ సారి పులిట్జర్ ప్రైజ్ దక్కింది. ఫీచర్ ఫోటోగ్రఫీ క్యాటగిరీలో ఆయనకు ఈ అవార్డు దక్కడం విశేషం.
భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేకు పరమ విశిష్ట సేవా పతకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి అందుకున్నారు. జనరల్ మనోజ్ పాండే ఏప్రిల్ 30న భారత 29వ ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ సందర్శనకు అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టిన ఎన్ఎస్యూఐ నాయకులు చంచల్‌గూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. వీరిని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, భట్టి విక్రమార్క ములాఖత్‌లో కలిసి పరామర్శించారు.