
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అద్భుత విజయం సాధించినందుకు ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్ నార్వే లో సంబరాలు నిర్వహించింది. ఈ క్రమంలో అక్కడ పలువురు నేతలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నార్వే ఏపీ డెవలప్‌మెంట్ ఫోరమ్ సపోర్ట్ చేస్తుందని వెల్లడించారు. ఇప్పటికే ఏపీలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ఘన విజయం సాధించడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీతోపాటు అనేక మంది శుభాకాంక్షలు తెలియజేశారు. లోక్‌సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు.
