తెలంగాణ రాష్ట్రంలో మరో ఆరు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. కొత్తగా నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి, భద్రాద్రి`కొత్తగూడెం జిల్లా పాల్వంచ, మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం మూడు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలకు, వరంగల్ జిల్లా మామునూరు, పెద్దపల్లి జిల్లా బసంత్ నగర్, ఆదిలాబాద్‌లో మొత్తం మూడు బ్రౌన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు వచ్చిన ప్రతిపాదనలపై టెన్నో ఎకనామిక్ ఫిజిబిలిటీ స్టడీ రిపోర్టును ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) పూర్తి చేసి నివేదికను జూలై 7న తెలంగాణ ప్రభుత్వానికి ఏఏఐ సమర్పించింది. ప్రతిపాదిత మూడు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులకు సంబంధించిన స్థల ఎంపిక అనుమతులను ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పౌర విమానయాన శాఖకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. కొత్తగా ఏర్పాటు చేయ తలపెట్టిన 6 విమానాయ్రాల్లో కేవలం రామగుండం విమానాశ్రయానికి సంబంధించి స్థలం దాదాపుగా అందుబాటులోకి ఉంది. మిగతా ఐదు ఎయిర్‌పోర్టులకు సంబంధించి స్థలాన్ని సేకరించాల్సి ఉంది.