రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఎవరికైనా ప్రత్యేక పరిస్థితులుంటే మినహా.. మిగతా వారు మాత్రం స్వదేశానికి రావాలని, తమకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించే అవకాశం ఉందన్న నేపథ్యంలో భారత ఈ హెచ్చరికలు జారీ చేసింది. రాయబార కార్యాలయం మాత్రం యథావిథిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని పేర్కొంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)