Skip to main content

Namaste NRI

కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు… తక్షణమే ఉక్రెయిన్ నుంచి

రష్యా, ఉక్రెయిన్‌ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో నివసిస్తున్న భారతీయులు, విద్యార్థులు తక్షణమే స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ  మేరకు కీవ్‌లోని భారత దౌత్యకార్యాలయం ఓ ప్రకటన చేసింది. ఎవరికైనా ప్రత్యేక పరిస్థితులుంటే మినహా.. మిగతా వారు మాత్రం స్వదేశానికి రావాలని, తమకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత రాయబార కార్యాలయానికి తెలియజేయాలని సూచించింది. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించే అవకాశం ఉందన్న నేపథ్యంలో భారత ఈ హెచ్చరికలు జారీ చేసింది. రాయబార కార్యాలయం మాత్రం యథావిథిగా తన కార్యకలాపాలు కొనసాగిస్తుందని పేర్కొంది.

Social Share Spread Message

Latest News