Namaste NRI

ఛలో నల్లగొండ సభను విజయవంతం చేయాలి : రాధారపు సతీష్ కుమార్

కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డ్  కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండించాలని ఎన్నారై బీఆర్‌ఎస్‌ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ  కేంద్రం నుంచి తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న, జరిగే ఛలో నల్లగొండ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు.  తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత మన అందరిపైనా ఉందని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతకాడికైనా పోరాడాలని పేర్కొన్నారు.నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించి తెలంగాణ హక్కులను కాపాడుకున్న స్ఫూర్తి తోనే నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలన్నారు.

Social Share Spread Message

Latest News