
నూతన తారాగణంతో తెరకెక్కిస్తున్న చండీ దుర్గమా చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హెచ్‌బీజే క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైనుఖాన్ ఎండీ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి హాస్య నటుడు అలీ క్లాప్‌నిచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు మైనుఖాన్ ఎండీ మాట్లాడుతూ ఇటీవలకాలంలో అమ్మవారి నేపథ్యంలో సినిమాలు రావడం లేదని, ఈ తరం ప్రేక్షకులు నచ్చేలా సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నామని, డార్క్ థీమ్ జోనర్‌లో సరికొత్త స్క్రీన్‌ప్లేతో ఆకట్టుకుంటుందని తెలిపారు. త్వరలో నటీనటులను ప్రకటించనున్న ఈ చిత్రానికి కెమెరా: వైఎస్ కృష్ణ, సంగీతం: ఎంకే, నిర్మాత: జయశ్రీ వెల్ది, రచన-దర్శకత్వం: మైనుఖాన్ ఎండీ.
