భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా నిర్వహించిన చంద్రయాన్-3 ప్రాజెక్టుకు అరుదైన గౌవరం దక్కింది. అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ చంద్రయాన్-3కి ఇంటర్నేషనల్ స్పేస్ అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ ప్రాజెక్టు చారిత్రాత్మక విజయమని పేర్కొంది. అక్టోబర్ 14న ఇటలీలోని మిలాన్‌లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ కాన్ఫరెన్స్ సందర్భంగా అవార్డును అందజేయ నున్నది. ఇస్రో చంద్రయాన్-3 ల్యాడర్ ఆగస్టు 23, 2023న రోజున చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ చేసిన విషయం తెలిసిందే. దాంతో అమెరికా, రష్యా, చైనాలతో భారత్ చంద్రుడిపై అడుగుపెట్టాయని అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్ సమాఖ్య పేర్కొంది.