వెంకట్ కల్యాణ్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం చెడ్డీ గ్యాంగ్ తమాషా.శ్రీ లీల ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై సి.హెచ్.క్రాంతి కిరణ్ నిర్మించారు. గాయత్రి పటేల్ కథానాయిక. ఈ సినిమా టైటిల్ టీజర్‌ను నటుడు సునీల్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్ బాగుంది. ఈ సినిమాని థియేటర్లలో చూసి కొత్తవాళ్లని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా అన్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్ నల్లగొప్పుల, ఛాయాగ్రహణం: జి..కె.యాదవ్ బంక.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)