Skip to main content

Namaste NRI

చెడ్డి గ్యాంగ్‌ తమాషా టీజర్‌ను విడుదల చేసిన సునీల్‌

వెంకట్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం చెడ్డీ గ్యాంగ్‌ తమాషా.శ్రీ లీల ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకాలపై సి.హెచ్‌.క్రాంతి కిరణ్‌ నిర్మించారు. గాయత్రి పటేల్‌ కథానాయిక. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ను నటుడు సునీల్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీజర్‌ బాగుంది. ఈ సినిమాని థియేటర్లలో చూసి కొత్తవాళ్లని ప్రోత్సహించాలని కోరుకుంటున్నా అన్నారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అర్జున్‌ నల్లగొప్పుల, ఛాయాగ్రహణం: జి..కె.యాదవ్‌ బంక.

Social Share Spread Message

Latest News