
భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాలుస్తున్న వేళ చైనా తన వైఖరిపై మాట మార్చింది. ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన చైనా, శాంతి, సుస్థిరతకు సంబంధించిన విశాల ప్రయోజనాల కోసం భారత్, పాక్ ప్రశాంతంగా ఉండాలని సూచించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో నిర్మాణాత్మక పాత్ర పోషించేందుకు అంతర్జాతీయ సమాజంతో చేతులు కలిపేందుకు తాము సిద్ధమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ స్పష్టం చేసినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని చైనా ఖండిస్తున్నట్లు కూడా ఆయన పునరుద్ఘాటించారు. ప్రస్తుత పరిణామాలపై చైనా ఆందోళన చెందుతోందని, భారత్, పాకిస్థాన్ ఇప్పుడు, ఎప్పుడూ ఇరుగు పొరుగు దేశాలేనని ఆమె వ్యాఖ్యానించారు.
