ముఖ్యమంత్రి కెసిఆర్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను ఓఎస్డీ ద్వారా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పంపించారు. కెసిఆర్ రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. మరోవైపు ఎన్నికల్లో బిఆర్ఎస్ పరాభవం అనంతరం కెసిఆర్ ప్రగతి భవన్ నుంచి తన సొంత వాహనంలో ఫామ్ హౌస్ చేరుకున్నారు. సాధారణ పౌరుడిలా సీఎం నివాసం ప్రగతి భవన్‌ను నుంచి బయటకు వెళ్లిపోయారు. గెలిస్తే పొంగిపోవడం, ఓడిపోతే కుంగిపోవటం కాదు ప్రజాప్రతినిధుల అంతిమలక్ష్యం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అని పదేపదే తన క్యాడర్‌కు చెప్పిన కేసీఆర్ అదే ఆదర్శ విలువను అక్షరాలా అనుసరించారు.