తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధానితో సమావేశమయ్యారు. గంటపాటు జరిగిన ఈ సమావేశంలో విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లు సమచారం. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధానికి ఓ నివేదిక అందజేశారు. పాలమూరు-రంగారెడ్డి, ఆర్‌ఆర్‌ఆర్ ప్రాజెక్టు, లాంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానితో రేవంత్ చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకరిస్తుందని ప్రధాని మోడీ హామీ ఇచ్చారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)