తెలంగాణలోని అంకాపూర్ అనే గ్రామం నేపథ్య కథతో తెరకెక్కిస్తున్న చిత్రం టీచర్. కలర్స్ స్వాతి, నిఖిల్ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్రగౌడ్, సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కలర్స్ స్వాతి టీచర్ పాత్రలో కనిపించనుంది. 90స్-ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్‌సిరీస్ ఫేమ్ ఆదిత్యహాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ మేడారం నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ చదువు అంతగా రాని ముగ్గురు డల్ స్టూడెంట్స్ కథ ఇది. ఓ టీచర్‌ని కలిసిన తర్వాత వారి జీవితం ఎలా మారిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, అందమైన..అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో ప్రతి ఒక్కరి హృదయాలను స్పృశిస్తుంది. ఆద్యంతం వినోదంతో మెప్పిస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్ మహమ్మద్, సంగీతం: సిద్ధార్థ్ సదాశివుని, రచన-దర్శకత్వం: ఆదిత్య హసన్.