Namaste NRI

కలర్స్‌ స్వాతి ప్రధాన పాత్రలో టీచర్‌

తెలంగాణలోని అంకాపూర్‌ అనే గ్రామం నేపథ్య కథతో తెరకెక్కిస్తున్న చిత్రం టీచర్‌. కలర్స్‌ స్వాతి, నిఖిల్‌ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్రగౌడ్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కలర్స్‌ స్వాతి టీచర్‌ పాత్రలో కనిపించనుంది. 90స్‌-ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ ఆదిత్యహాసన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ మేడారం నిర్మాత. దర్శకుడు మాట్లాడుతూ చదువు అంతగా రాని ముగ్గురు డల్‌ స్టూడెంట్స్‌ కథ ఇది. ఓ టీచర్‌ని కలిసిన తర్వాత వారి జీవితం ఎలా మారిందనేది ఆసక్తికరంగా ఉంటుంది. సరదా సన్నివేశాలు, అందమైన..అమాయకమైన ప్రేమ, భావోద్వేగాలతో ప్రతి ఒక్కరి హృదయాలను స్పృశిస్తుంది. ఆద్యంతం వినోదంతో మెప్పిస్తుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్‌ మహమ్మద్‌, సంగీతం: సిద్ధార్థ్‌ సదాశివుని, రచన-దర్శకత్వం: ఆదిత్య హసన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events