
డిట్రాయిట్‌లోని నోవైలో జూలై 3 నుంచి 5వ తేదీ వరకు జరగనున్న తానా 24వ మహాసభలను పురస్కరించుకుని తానా నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిగారిని కలిసి ముఖ్యఅతిధిగా మహాసభలకు రావాల్సిందిగా ఆహ్వనించారు. ఈ సందర్భంగా వారు మహాసభలకు సంబంధించిన వివరాలను, విశేషాలను, కమ్యూనిటీకి తానాచేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు.


ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తానాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, ఈ మహాసభలకు వస్తానని తెలియజేశారు.

తానా కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ, మాజీ అధ్యక్షులు జయరామ్ కోమటి, తానా మహాసభల డైరెక్టర్ సునీల్ పాంట్ర, చందు గొర్రెపాటి, శశి దొప్పాలపూడి, కన్నా దావులూరు ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.
