Namaste NRI

ఆ రాష్ట్రంలో మూడోసారి ఖాతా తెరవని కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ   కి మరోసారి తీరని దెబ్బ తగిలింది. ముచ్చటగా మూడోసారి ఏపీలో ఏ ఒక్క స్థానంలో గెలువలేక పోయింది. వైఎస్‌ షర్మిల తోనైనా పార్టీ పరువు కాపాడుకోవచ్చని భావించినా కాంగ్రెస్‌ అధిష్టానానికి చుక్కెదురయ్యింది . ఏపీలో 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్‌ స్థానాలుండగా కాంగ్రెస్‌ వందకు పైగా స్థానాల్లో పోటీ చేసింది. అయితే ఏ ఒక్క స్థానంలో విజయం సాధించలేకపోయింది.

ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల నియామకం అయిన తరువాత పార్టీ పుంజుకుందని భావించిన ఆ పార్టీ నాయకులకు నిరాశే ఎదురయ్యింది. కడప ఎంపీ స్థానానికి పోటీ చేసి వైఎస్‌ షర్మిల సైతం ఓటమిపాలు కావడం జీర్ణించుకోలేని విషయం. 2012లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తరువాత 2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఏ ఒక్క సీటును దక్కించుకోలేక పోయింది. 2024 ఎన్నికల్లో అవే ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌ శ్రేణులు కంగుతింటున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events