ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, ఇతర ఉన్నతాధికారుల హత్యకు రష్యా పన్నిన కుట్రను ఉక్రెయిన్ ఇంటెలి జెన్స్ ఏజెన్సీ భగ్నం చేసినట్టు ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ వెల్లడించింది. అధ్యక్షుడు జెలెన్‌స్కీ సహా మిలిటరీ ఇంటెలిజెన్స్ హెడ్ కైరోలో బుడనోవ్, ఎస్‌బీయూ చీఫ్ వాసిల్ మాల్యుక్ తదితరులు ఈ హిట్ లిస్టులో ఉన్నారని తెలిపింది. దేశాధినేతను పట్టుకుని చంపించాలనుకుందని, దానిలో భాగంగా, జెలెన్‌స్కీ భద్రతకు దగ్గరగా ఉన్న మిలిటరీలోని బలమైన నేరస్థులను కనుగొనడం రష్యా గూఢచారి సంస్థ ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ లక్ష్యంగా పెట్టుకుందని ఉక్రెయిన్ అధికారి ఒకరు తెలిపారు. అయితే దానిని సమర్ధవంతంగా తిప్పికొట్టినట్టు చెప్పారు.